![క్యాన్సర్ రోగుల్లో మానసిక స్థైర్యం నింపుతున్నం : బాలకృష్ణ](https://static.v6velugu.com/uploads/2022/12/Nandamuri-Balakrishna_hEfIOzmSMH.jpg)
క్యాన్సర్ రోగులకు భరోసా ఇవ్వడంతో పాటు.. వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నట్లు నటుడు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ చెప్పారు. తమ తల్లిదండ్రులు ఏ లక్ష్యంతో ఆస్పత్రి స్థాపించారో అందుకనుగుణంగా అంకితభావంతో పనిచేస్తున్నామని అన్నారు. తమ వైద్య సేవల్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అవార్డ్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, వ్యాధిపై పరిశోధనలు అదే స్థాయిలో జరుగుతున్నాయని బాలకృష్ణ చెప్పారు.
ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించడం కోసం క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ లో ఉన్న ఎమర్జెన్సీ వార్డ్ లో14 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యాధునిక పరికరాలతో ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేస్తూ, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.