మంచు ఫ్యామిలీ ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప(Kannappa). మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు(Mohan Babu) కూడా కీ రోల్ చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) తెరకెక్కిస్తున్నారు. మంచు ఫ్యామిలీలోనే బిగ్గెస్ట్ సినిమాగా వస్తున్న కన్నప్ప ను ఎలాగైనా హిట్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమా కోసం ఇండియన్ వైడ్ గా స్టార్ క్యాస్ట్ ను దింపుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) శివుడిగా, నయనతార(Nayanthara) పార్వతిగా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి. ఇక కన్నడ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్(Shivraj kumar), మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్(Mohan lal) వంటి స్టార్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇక తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ హీరో యాడ్ అయ్యారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna). అవును కన్నప్ప సినిమాలో ఓ కీ రోల్ కోసం బాలకృష్ణను కలిశారట మంచు విష్ణు. దానికి బాలకృష్ణ కూడా వెంటనే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుండి దాదాపు అందరు స్టార్స్ వచ్చేశారు. ఇంకా ఎవరు మిగిలారన్నా. సినిమా మొత్తం స్టార్సే ఉన్నారు కాదన్నా.. మరి సినిమా ఎలా ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి ఇంతమంది స్టార్స్ తో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.