2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కాగా, ఏపీలో నాలుగవ దశలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గురువారం నాడు ( ఏప్రిల్ 18 ) నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే స్థానానికి నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు.
హిందూపురంలోని సుగూరు ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలయ్య ఇంటివద్ద నుండి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. హిందూపురం రెండుసార్లు గెలుపొందిన బాలకృష్ణ ఈ ఎన్నికల్లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు అభిమానులు, కార్యకర్తలు.