NBK 109: జాలి, దయ, కరుణ లేని అసురుడు.. అదిరిపోయిన NBK 109 కొత్త టీజర్

NBK 109: జాలి, దయ, కరుణ లేని అసురుడు.. అదిరిపోయిన NBK 109 కొత్త టీజర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ ఇస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లితో కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుండి మరో టీజర్ విడుదల చేశారు మేకర్స్. 

తాజాగా జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా NBK 109 నుండి కొత్త టీజర్ విడుదల చేశారు. దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. వీళ్ళ అంతు చూడాలంటే.. కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాల అర్ధమే తెలియని అసురుడు.. అనే డైలాగ్ తో వచ్చిన ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఆ డైలాగ్ తో బాలయ్యకు ఎలివేషన్ ఇప్పిస్తూ ట్రైన్ పక్కన స్మోక్ లో నుండి వస్తున్న సీన్ నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశారు. బర్త్ డే సర్ప్రైజ్ గా వచ్చిన ఈ టీజర్  నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేసింది. 

ఇక టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించే లక్షణాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అనేది చూడాలి.