హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర.. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని.. నివాళులు అర్పించారు ఆయన కుమారుడు బాలకృష్ణ. నివాళులు అర్పించి వస్తున్న సమయంలో.. ఘాట్ చుట్టూ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం పేర్లతో ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని.. ఇప్పుడే పీకేయాలంటూ పక్కనే ఉన్న వారిని ఆదేశించారు బాలయ్య. జనవరి 18వ తేదీ తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం నివాళులు అర్పించి వెళ్లగా.. ఆ తర్వాత బాలయ్య వచ్చారు.
ఎన్టీఆర్ చనిపోయిన రోజు సందర్భంగా.. పెద్ద ఎన్టీఆర్ ఘాట్ దగ్గర.. భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం పొటోలతో.. ఈ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉన్నాయి.. వీటిని చూసిన బాలయ్య.. వెంటనే వాటిని తీసేయండి.. ఇప్పుడే తీసేయండి అని ఆదేశించటం ఆన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాలయ్య ఆదేశాలతో.. పక్కనే ఉన్న వ్యక్తి.. అజయ్ అని పిలవటం కూడా స్పష్టంగా వినిపిస్తుంది.
నందమూరి కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం దూరంగానే ఉంటున్నారు. చాలా ముఖ్యమైన ఫంక్షన్స్ ఉంటే తప్పితే.. మిగతా ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోవటం లేదు. అంతెందుకు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత.. ఆ అరెస్ట్ పై కనీసం ఎక్స్ లో కూడా కామెంట్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ రాజకీయాలకే కాదు.. చంద్రబాబు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య సైతం.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని.. ఇప్పుడే పీకేయాలని చెప్పటం విశేషం.. ఈ పరిణామాలు.. నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంత దూరం అయ్యాడో స్పష్టంగా చెబుతోంది..