‘డాకు మహారాజ్’ పవర్.. సంక్రాంతికి వస్తున్న బాలయ్య సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..

‘డాకు మహారాజ్’ పవర్.. సంక్రాంతికి వస్తున్న బాలయ్య సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..

బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్  బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు చెప్పారు.

ఇందులో బాలకృష్ణను  పవర్‌‌‌‌ఫుల్‌‌ లుక్‌‌లో చూడబోతున్నారంటూ శనివారం కొత్త స్టిల్స్‌‌ను రిలీజ్ చేశారు. బాలయ్య ఇంటెన్స్ మోడ్‌‌లో  కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్‌‌‌‌లో ఇది 109వ చిత్రం. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్  హీరోయిన్స్‌‌గా నటిస్తుండగా,  బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.