నందమూరి బాలయ్య సినిమా టైటిల్ ‘అఖండ’

నందమూరి బాలయ్య సినిమా టైటిల్ ‘అఖండ’

నందమూరి స్టార్ హీరో బాల‌కృష్ణ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది. ఉగాది పండుగ సందర్భంగా సినిమా టైటిల్ ‘అఖండ’ ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తోపాటు టీజర్ కూడా విడుదల చేశారు. బోయ‌పాటి శీను ద‌ర్శక‌త్వంలో 106వ సినిమా చేస్తున్న బాలకృష్ణ మూవీ టైటిల్ విషయంలో ఉత్కంఠ రేపింది. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ సింహా.. లెజెండ్.. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నిర్మాణం కొనసాగుతుండగా బయటకొచ్చిన మూవీ స్టిల్స్  భారీ అంచనాలు రేకెత్తాయి. టైటిల్ కూడా రెండు లేదా మూడక్షరాల్లో ఉంటుందన్న ఊహాగానాలకు తెరదించుతూ అఖండ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో బాలయ్య మేకోవర్ సరికొత్తగా కనిపించింది. టీజర్ లో ‘ కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్.. ఫైటింగ్ సీన్లతో వచ్చిన టీజర్ భారీ అంచనాలకు ఊపు ఇచ్చింది. సింహ, లెజెండ్ సినిమాల్లోని సీన్లను మరిపించేలా ఉన్న టీజర్ అభిమానుల్లో  మరింత ఉత్కంఠ రేపింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాకు తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. బాల‌కృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రీకాంత్ కీలకపాత్ర లో నటిస్తున్నారు. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.