నందమూరి చైతన్య కృష్ణ(Nandamuri Chaitanya Krishna) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రీత్(Breath). మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ(Vamshi Krishna akella) తెరకెక్కించాడు. వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్ కీ రోల్స్ లో కనిపించారు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు.. సినిమాపై కూడా తీవ్ర ట్రోలింగ్ నడిచింది. దీంతో మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక దాదాపు రెండు నెలల తరువాత ఓటీటీలో రిలీజ్ కు సిద్దమయ్యింది ఈ సినిమా. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మహాశివరాత్రి కానుకగా మార్చ్ 8న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.