ఎన్టీఆర్ వన్‌‌‌‌ మ్యాన్ షో..కొన్ని సీన్స్ గూజ్ బంప్స్ : కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ వన్‌‌‌‌ మ్యాన్ షో..కొన్ని సీన్స్ గూజ్ బంప్స్ : కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో  రూపొందిన హై ఓల్టేజ్ ఎంటర్‌‌‌‌టైనర్   ‘దేవర’.  రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న  ఈ మూవీ ఫస్ట్ పార్ట్ శుక్రవారం వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదలైంది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలియజేసింది టీమ్. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మా తమ్ముడు ఇరగదీసేశాడు. వన్ మ్యాన్ షో. కొన్ని సీన్స్ గూజ్ బంప్స్ తెప్పించాయి. 

ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పారు.  ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసిన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘టాలీవుడ్  స్టార్ హీరో సినిమా వ‌‌స్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవ‌‌ర్‌‌సీస్‌‌లోనూ పండుగ వాతావ‌‌రణం  ఉంటుంది. అన్ని చోట్ల నుంచి  బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. డే వ‌‌న్ క‌‌లెక్షన్స్ ప‌‌రంగా టాప్ 2 మూవీ అయ్యేలా ఉంది’ అని చెప్పారు. 

కొరటాల శివ మాట్లాడుతూ ‘నా కెరీర్‌‌లో బెస్ట్ మూవీ అంటున్నారు. ఈ అవ‌‌కాశం ఇచ్చిన ఎన్టీఆర్‌‌, క‌‌ళ్యాణ్ రామ్‌‌, సుధాక‌‌ర్‌‌ గారికి థ్యాంక్స్.  టీమ్ అందరి కష్టంతోనే ఇలాంటి ప్రతిఫలం వచ్చింది’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్,  లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, నిర్మాత మిక్కిలినేని సుధాకర్ పాల్గొన్నారు.