
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్‌గా 'వైజయంతీ ఐపీయస్' పాత్రలో కనిపించనుంది.
లేటెస్ట్గా నేడు (మార్చి 17న) ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కల్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను పరిచయం చేస్తూ వచ్చిన ఈ టీజర్ పవర్ ఫుల్ ఫుల్ డైలాగ్స్తో ఆసక్తిగా సాగింది. ' పది సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో పోలీస్ ఆపరేషన్స్.. కానీ, చావుకి ఎదురెళ్తోన్న ప్రతిసారి నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్' అంటూ విజయ శాంతిని పరిచయం చేస్తూ, ఆమె చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
'నెక్స్ట్ బర్త్ డేకి నాకివ్వబోయే గిఫ్ట్ ఇదేనంటూ ఓ పోలీస్ డ్రెస్‌ను అర్జున్ కి అందిస్తుంది. అయితే, అర్జున్ పోలీస్ ఆఫీసర్‌గా కాకుండా ఓ డాన్‌గా కనిపించబోతున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. అలాగే, ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్న నటుడు పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ ఆలోచింపజేస్తుంది. ఈ సిటీలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఉందా, చచ్చిపోయిందా అంటూ ఆసక్తిపెంచాడు.
'రేపటి నుంచి వైజాగ్‌ను పోలీసులు, నల్లకోట్లు కాదు ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి' అనే డైలాగ్‌తో కళ్యాణ్ రామ్ మాస్ ఎంట్రీ అదిరింది. అసలు అర్జున్ పోలీసా?.. లేక పోలీస్ ఆఫీసర్ నుంచి డాన్‌గా మారాడా.? అనే సస్పెన్స్ నెలకొంది.
Also Read : రమణ గోగుల గొంతుకు అవకాశాల వెల్లువ
'నేను డ్యూటీలో ఉన్నప్పుడు తప్పు చేసింది బంధువైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచేసింది. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, ఎమోషన్స్, వైరం, సెంటిమెంట్ నేపథ్యంలో 'అర్జున్ S/O వైజయంతి' సినిమా రూపొందినట్లు మొత్తానికి టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీ సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
ఇది కల్యాణ్ రామ్ కెరీర్లో 21 సినిమాగా రాబోతుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఉండనుంది.