
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
లేటెస్ట్గా (మార్చి 14న) ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ, చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. సోమవారం (మార్చి 17న) అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రానుందని మేకర్స్ తెలిపారు.
ఈ గ్లింప్స్లో కళ్యాణ్ రామ్ సముద్రపు ఒడ్డున ఉన్న పడవపై గంభీరంగా కూర్చుని ఉన్నాడు. దీనికి తోడు బ్యాక్గ్రౌండ్లో వస్తోన్న బిజియమ్ ఇంటెన్స్గా ఉంది. దీన్నీ బట్టి టీజర్ ఎలా ఉండనుందో అనే ఆసక్తి రేపుతోంది.
ఇకపోతే, ఇది కల్యాణ్ రామ్ కెరీర్లో 21 సినిమాగా రాబోతుంది. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్‌గా 'వైజయంతీ ఐపీయస్' పాత్రలో కనిపించనుంది.
సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నఈ చిత్రంలో సోహైల్ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఉండనుంది.
#NKR21 is '????? ?/? ??????????'.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) March 8, 2025
Happy Women's Day to all the great women and mothers out there ✨
So glad to be working with @vijayashanthi_m Garu.
See you in cinemas soon. #ArjunSonOfVyjayanthi@saieemmanjrekar @SohailKhan @PradeepChalre10 @SunilBalusu1981… pic.twitter.com/EHq490qliO