నందమూరి కుటుంబంలో పురందేశ్వరి, భువనేశ్వరి పెద్ద విలన్స్ : ల‌క్ష్మీపార్వతి

ఎన్టీఆర్ రూ. 100 నాణేన్ని  అందుకునే అర్హత పురందేశ్వరి, భువనేశ్వరికి లేదన్నారు ఆయన సతీమణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వతి అన్నారు.   ఎన్టీఆర్ స్మార‌క నాణేన్ని భార్యగా అందుకోడానికి త‌న‌కు మాత్రమే అర్హత ఉందని చెప్పుకొచ్చారు.  తనకంటే ఎక్కువ అవమానాన్ని వారు భవిష్యత్తులో ఎదురుకుంటారని శపించారు.  నందమూరి కుటుంబంలో  పురందేశ్వరి, భువనేశ్వరి పెద్ద విలన్స్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజ‌మెత్తారు.

 పురందేశ్వరి ఆమె భర్త పెద్ద అవినీతిపరులంటూ ల‌క్ష్మీపార్వతి ఆరోపించారు.  ఎన్టీఆర్ భార్యగా తనకున్న గుర్తింపును తొలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ల‌క్ష్మీపార్వతి కామెంట్స్ చేశారు.   ఎవరైతే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారో వారే ఎన్టీఆర్ రూ. 100 నాణేం   కార్యక్రమానికి వెళ్లారని అన్నారు.  ఇక‌పై త‌న పోరాటం పురందేశ్వరిపై అని ల‌క్ష్మీపార్వతి ప్రక‌టించారు. ఆమె తిరిగే ప్రతి  నియోజ‌క‌వ‌ర్గంలో తాను వ్యతిరేకంగా తిరుగుతాన‌ని చెప్పారు.   తనను అవమానించడమంటే స్వయంగా ఎన్టీఆర్ ను అవమానించడమేనని అన్నారు.