Mokshagna, Prasanth varma: సూపర్ హీరోగా నందమూరి వారసుడు.. హనుమాన్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్!

Mokshagna, Prasanth varma: సూపర్ హీరోగా నందమూరి వారసుడు.. హనుమాన్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్!

నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. గ్రాండ్ లెవల్లో ఉందనున్న ఆ సినిమా కోసం చాల మంది స్టార్ డైరెక్టర్స్ పోటీపడుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. 

తాజాగా ఈ లిస్టులో మరో లేటెస్ట్ స్టార్ డైరెక్టరో చేరిపోయారు. ఆ దర్శకుడు మరెవరో కాదు హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ. అవును.. ప్రశాంత్ వర్మ తన దగ్గర చాలా సూపర్ హీరో కాన్సెప్ట్స్ ఉన్నట్టుగా గతంలోనే చెప్పారు. ఆ కథల్లో ఒక సూపర్ హీరో కథను తాజాగా బాలకృష్ణకు వినిపించాడట ప్రశాంత్ వర్మ. డివోషనల్ ఎలిమెంట్స్ తో ఉన్న ఆ సూపర్ హీరో మూవీ బాలయ్యకు తెగ నచ్చేసిందట. అలాంటి కథతో అయితేనే తన వారసుడి ఎంట్రీ సాలిడ్ గా ఉంటుందని నమ్ముతున్నాడట బాలకృష్ణ. అందుకే ఆ కథకు వెంటనే ఒకే చెప్పేశాడట బాలయ్య. 

ఇక గతంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షోకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి ప్రశాంత్ వర్మపై బాలకృష్ణకు బలమైన నమ్మక ఏర్పడింది. ఇటీవల ఆయన చేసిన హనుమాన్ సినిమా చూశాక ఆ నమ్మకం మరింత పెరిగింది. అందుకే.. తన వారసుడిని ఎంట్రీ సినిమాను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాలని ఫిక్స్ అయ్యాడట బాలకృష్ణ. అయితే.. ప్రస్తుతం రూమర్ గానే ఉన్న ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకనట వచ్చే వరకు ఆగాల్సిందే.