Mokshagna: మోక్షజ్ఞ న్యూలుక్ కు ఫ్యాన్స్ ఫిదా.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తన సూపర్ హీరో కథతో నందమూరి బాలయ్య వారసుడ్ని పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ (Mokshagna) సినీ ఎంట్రీని కన్ఫమ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తాజాగా సరికొత్త ఫొటో షేర్ చేశారు.

నందమూరి మోక్షజ్ఞ ఒరిజినల్ ఫోటోని షేర్ చేస్తూ.. 'యాక్షన్‌ కోసం సిద్ధమా?' అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో ఈ పిక్ చూసిన నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతూ.. హీరో మెటీరియల్లా కుర్రాడు భలే ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫొటోలో మోక్షజ్ఞ పూర్తిగా స్లిమ్ అయ్యాడు. ఇప్పటికే, ఈ సినిమా కోసం నృత్యాలు, పోరాటాల్లో శిక్షణ తీసుకుని బరిలో దిగాడు. బాలయ్య తగ్గ వారసుడి అనిపించుకునేలా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ALSO READ | వామ్మో ఇంతనా: పుష్ప 2 టికెట్ రేట్లు.. ప్రేక్షకుడి జేబుకి చిల్లు పడడం ఖాయం!

భార‌తీయ పురాణాలు, ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందుతూ సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మఈ మూవీని రూపొందిస్తోన్న‌ట్లు స‌మాచారం. మోక్ష‌జ్ఞ తేజ డెబ్యూ మూవీలో పురాణాల్లోని గొప్ప యోధుడి ప్ర‌స్తావ‌న ఉంటుంద‌ని అంటున్నారు. ఈ మూవీని SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మించనున్నారు.