బాలయ్య లీలా జపం.. శ్రీలీలతో నందమూరి వారసుడు

నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth kesari). టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్బంగా రిలీజైన భగవంత్ కేసరి ట్రైలర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. భగవంత్ కేసరిలో శ్రీలీల నా కూతురిగా చేసింది.. తరువాతి సినిమాలో హీరోయిన్ గా చేయాలనుకుంటున్నా అని నా కొడుకు మోక్షజ్ఞ తో అంటే.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని వార్నింగ్ ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. బాలయ్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

Also Read : నీతో ఉన్న ప్రతీ క్షణం ఓ అద్భుతం.. రకుల్ బాయ్ఫ్రెండ్ స్పెషల్ పోస్ట్

ఏ క్రమంలోనే మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం భగవంత్ కేసరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ సందర్బంగా నందమూరి మోక్షజ్ఞ భగవంత్ కేసరి టీమ్ తో గ్రూప్ ఫోటోల్క్ దిగారు. ఆ ఫొటోలో మోక్షజ్ఞ శ్రీలీల పక్కనే నిల్చొని కనిపించాడు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి హీరోయిన్ దొరికేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి నిజంగా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ శ్రీలీల హీరోయిన్ గా చేస్తుందా అనేది చూడాలి మరి.