Mokshagna,Prasanth Varma: అఫీషియల్..బాలయ్య వారసుడొచ్చేశాడు..మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ చూశారా?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కుమారుడు నందమూరి మోక్షజ్ఞ (Mokshagna)  టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేశారు. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్ లో తన మొదటి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. 

ఇవాళ శుక్రవారం సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని తెలుపుతూ ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అంటూ ట్విట్టర్ X లో పోస్ట్ పెట్టారు ..

"నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజను ప్రత్యేక హక్కుతో పరిచయం చేయడం గొప్ప ఆనందాన్ని ఇస్తోంది..జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ..అందరి నమ్మకానికి, ఆశీస్సులకు నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు" అని తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో..మోక్షజ్ఞ క్యూట్ లుక్లో సింపుల్ గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి కనిపిస్తున్నాడు. మోక్షు ఫస్ట్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Also Read:-35 చిన్న కథ కాదు రివ్యూ.. పిల్లలు,పేరెంట్స్ చూడాల్సిన సినిమా

పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాశం ఉండబోతున్నట్టు సమాచారం. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సూపర్ హీరో కథ

ప్రశాంత్ వర్మ తన దగ్గర చాలా సూపర్ హీరో కాన్సెప్ట్స్ ఉన్నట్టుగా గతంలోనే చెప్పారు. ఆ కథల్లో ఒక సూపర్ హీరో కథను బాలకృష్ణకు వినిపించాడట ప్రశాంత్ వర్మ. డివోషనల్ ఎలిమెంట్స్ తో ఉన్న ఆ సూపర్ హీరో మూవీ బాలయ్యకు తెగ నచ్చేసిందట. అలాంటి కథతో అయితేనే తన వారసుడి ఎంట్రీ సాలిడ్ గా ఉంటుందని బలంగా నమ్మడట బాలకృష్ణ. అందుకే సూపర్ హీరో కథతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.  

ఇక గతంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షోకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి ప్రశాంత్ వర్మపై బాలకృష్ణకు బలమైన నమ్మక ఏర్పడింది. ఇటీవల ఆయన చేసిన హనుమాన్ సినిమా చూశాక ఆ నమ్మకం మరింత పెరిగింది. అందుకే..తన వారసుడిని ఎంట్రీ సినిమాను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాలని ఫిక్స్ అయ్యాడట బాలకృష్ణ. అంతేకాదు ఈ తాజా కాంబోపై బాలయ్య అభిమానులు కూడా హిట్ పక్కా అని బలంగా నమ్ముతున్నారు.