హైదరాబాద్, వెలుగు: టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మరో ముగ్గురికి చోటు కల్పించారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని (కూకట్పల్లి నియోజక వర్గం), రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ నాయుడు (కొల్లాపూర్ నియోజకవర్గం), రాష్ట్ర కార్యదర్శిగా బి.విఠల్ (బాన్సువాడ నియోజకవర్గం)ను నియమించారు.
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా షకీలా రెడ్డి (ఖైర తాబాద్ నియోజకవర్గం), జహీరాబా ద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గా కరాటే రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.