Yuvagalam:యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లిన తారకరత్న

అమరావతి : యువగళం యాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న  సొమ్మసిల్లి పడిపోయారు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేశ్ ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తారకరత్న కూడా పాల్గొన్నారు. నారా లోకేశ్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.