
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో సెప్టెంబర్ చివర్లో, అక్టోబర్ ప్రారంభంలో 48 గంటల వ్యవధిలోనే 31 మంది రోగుల మరణాలు నమోదయ్యాయి. గత ఎనిమిది రోజుల్లో మరో 108 మరణాలను నమోదైనట్టు సమాచారం. గడచిన 24 గంటల్లో ఆసుపత్రిలో పసిపాపతో సహా 11 మంది రోగులు మరణించారు. ఈ మరణాలపై వ్యాఖ్యానిస్తూ సెంట్రల్ నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్ శ్యామ్ వాకోడ్, ఆసుపత్రిలో మందుల కొరత లేదని పునరుద్ఘాటించారు.
"గత 24 గంటల్లో, 1వెయ్యి 100 మందికి పైగా రోగులను వైద్యులు టెస్ట్ చేశారు. 191 మంది కొత్త రోగులను ఆసుపత్రిలో చేర్చుకున్నాం" అని డీన్ చెప్పారు. "24 గంటల్లో సగటు మరణాల రేటు అంతకుముందు 13గా ఉంది, ఇది ఇప్పుడు 11కి పడిపోయింది" అని వాకోడ్ చెప్పారు. "మరణాలలో పుట్టుకతో వచ్చే రుగ్మతలతో జన్మించిన పిల్లలు ఉన్నారు" అని తెలిపారు. "మేము సాధారణంగా మా బడ్జెట్‌ను బట్టి మూడు నెలల పాటు స్టాక్‌ను నిర్వహించడానికి ప్రయత్నిస్తాం" అని ఆయన అన్నారు. "మందుల కొరత కారణంగా ఏ రోగి చనిపోలేదు, వారి పరిస్థితి క్షీణించడం వల్లే వారు మరణించారు" అని ఆసుపత్రి డీన్ చెప్పారు.
అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ ఘటనపై స్పందించారు. నాందేడ్ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో 60 మందికి పైగా శిశువులు చేరారని, అయితే శిశువులను చూసుకోవడానికి ముగ్గురు నర్సులు మాత్రమే ఉన్నారని చెప్పారు. ఒకేసారి ముగ్గురు శిశువులకు చికిత్స చేయడానికి ఒక వార్మర్‌ని ఉపయోగించారని, డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోని ఎన్‌ఐసియులో కేవలం ముగ్గురు నర్సులు మాత్రమే పనిచేస్తున్నారని నాందేడ్ జిల్లాలోని భోకర్ ఎమ్మెల్యే తెలిపారు.