
పటాన్చెరు, వెలుగు: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పేదలరకు ఒక వరమని పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని 23వ వార్డు లో బీజేపీ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 600 మందికి ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదెల్లి రవీందర్, కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, కో కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆగా రెడ్డి, అనిల్ చారి, శ్రవణ్ పాల్గొన్నారు.