![చేవెళ్ల రేసులో నంది ఎల్లయ్య వారసుడు](https://static.v6velugu.com/uploads/2023/08/Nandi-Yellaiah-son-in-the-Chevella-race-of-elections_5vaWBEYrQq.jpg)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ టికెట్ రేసులో మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య తమ్ముడి కొడుకు నంది నరహరి నిలిచారు. ఈ స్థానం నుంచి తనను అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ నరహరి మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. ఏడుసార్లు లోక్సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన నంది ఎల్లయ్య వెంటే తన జీవితకాలమంతా కాంగ్రెస్లో పని చేశానని, తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నాయకులను కోరారు. బీఆర్ఎస్లో చేరితే రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా.. కాంగ్రెస్ ఫ్యామిలీలోనే కొనసాగానని, తమ విధేయతను పార్టీ హైకమాండ్ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.