టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగామ సురేష్ అరెస్టైన సంగతి తెలిసిందే.ఈ అరెస్ట్ టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ దుమారం రేపుతోంది. తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారంటూ ఆరోపిస్తున్నారు నందిగామ సురేష్ భార్య బేబీలత. టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసులో ఒక్క ఆధారమైనా చూపాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన బోట్లపై అనవసరంగా తన భర్త పేరు తెస్తున్నారని, ఈ విషయంపై హోంమంత్రి అనిత తన బిడ్డలపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు.
Also Read:-ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
అనిత తన బిడ్డలతో వస్తే, తానూ తన పిల్లలతో వస్తానని అన్నారు. తన సవాల్ కు హోంమంత్రి సిద్దమేనా అని ప్రశ్నించారు బేబీ లత.
మరి, బేబీలత సవాల్ కు మంత్రి అనిత నుండి కానీ, టీడీపీ నుండి కానీ ఎలాంటి కౌంటర్ వస్తుందన్నది ఆసక్తిగా మారింది. రోజుకో మలువు తిరుగుతున్న బోటు రాజకీయం ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.