
ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అందులోనూ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ పోటీలు జరగడం గమనార్హం. 2025, మే 7 నుంచి మే 31 వరకు హైదరాబాద్ వేదికగా ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. సొంత దేశంలో జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీలకు భారత్ తరుఫున 21 ఏళ్ల నందిని గుప్తా ప్రాతినిథ్యం వహించనుంది.
రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా.. 2023, ఏప్రిల్ 15న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 పోటీల్లో విజేతగా నిలిచింది. తన ఆకట్టుకునే అందం, అద్భుతమైన తెలివితేటలు, దృడమైన ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని విజేతగా నిలిచింది నందిని గుప్తా. ఈ నేపథ్యంలోనే 72వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ తరుఫున ఎంపికైంది నందిని గుప్తా.
మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు మొదలయ్యాంటే..?
మిస్ వరల్డ్ పోటీలు మొదట 1951లో యూనెటెడ్ కింగ్డమ్ (బ్రిటన్)లో మొదలయ్యాయి. ఎరిక్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీలను మొదట నిర్వహించారు. మిస్ వరల్డ్ కాంపిటిషన్ అత్యంత పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటి పేరు గాంచింది. 2000లో ఎరిక్ మోర్లీ మరణిండంతో మిస్ వరల్డ్ కాంపిటిషన్ నిర్వహణ బాధ్యతలను ఆయన భార్య జూలియా మోర్లీ చేపట్టారు.
2000 సంవత్సరం నుంచి ఆమెనే మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 71 ఎడిషన్ల అయిపోయాయి. 2025లో భారత్ లో జరగనుంది 72వ మిస్ వరల్డ్ కాంపిటిషన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిస్ వరల్డ్ అందాల పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతుండటంతో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు రావడంతో పాటు పర్యాటక అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచవేదికలపై మోరు మోగనుంది.