
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కేరళలోని కొచ్చిలో జరుగుతున్న నేషనల్ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. విమెన్స్ హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో తను టాప్ ప్లేస్‌తో స్వర్ణం కైవసం చేసుకుంది. మంగళవారం ముగిసిన ఈ పోటీలో నందిని మొత్తంగా 5813 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది.
2023 ఆసియా గేమ్స్ హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకంతో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి ఏడు ఈవెంట్లలో తన మార్కు చూపెట్టింది. 100 మీ. హర్డిల్స్‌ను 13.75 సెకండ్లలో పూర్తి చేసిన ఆమె.. 200 మీ రన్‌ను 23.63 సెకండ్లలో ఫినిష్ చేసింది. హై జంప్‌లో 1.65 మీటర్లు, షాట్ పుట్‌లో 13.49 మీటర్లు, లాంగ్ జంప్‌లో 6.01 మీటర్లు నమోదు చేసిన నందిని జావెలిన్ త్రో 32.38 మీటర్లు, 800మీ ఈవెంట్‌లో 2:15.70 సెకండ్లతో సత్తా చాటింది.
మరోవైపు ఏపీ అమ్మాయి యర్రాజి జ్యోతి విమెన్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ నెగ్గింది. ఫైనల్‌ను 13.23 సెకండ్లలో ముగించిన జ్యోతి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ క్వాలిఫికేషన్ మార్క్ 13.26 సెకండ్ల కంటే మెరుగైన పెర్ఫామెన్స్ చేసింది.