నందిపేట, వెలుగు: నందిపేట మండల కేంద్రంలో బస్సు డిపో కోసం స్థలాన్ని వినియోగంలోకి తీసుకువస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన బస్టాండ్ సమీపంలో ఉన్న ఐదెకరాల బస్సు డిపో స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిపో కోసం కొన్నేళ్ల క్రితం ఉమ్మడి నందిపేట మండల వాసులు చందాలు వేస్కొని ఈ స్థలాన్ని కొన్నారు.
గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల నిరుపయోగంగా మారిందన్నారు. తాను అధికారులతో మాట్లాడారు. స్థలాన్ని వాడుకలోకి తెస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నందిపేట హైస్కూల్, కస్తూరిబా స్కూళ్లను పరిశీలించారు. ఆయన వెంట పెద్దోళ్ల గంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రాజు, నాయకులు లింగారెడ్డి, చిన్నారెడ్డి, రమేశ్ తదితరులు
ఉన్నారు.