HIT3 Censor: జాగ్రత్త.. HIT3 కి ‘A’ సర్టిఫికేట్.. ఈ వయసున్న పిల్లలకు టికెట్ బుక్ చేశారో .. మీ డబ్బులు పోయినట్టే!

HIT3 Censor: జాగ్రత్త.. HIT3 కి ‘A’ సర్టిఫికేట్.. ఈ వయసున్న పిల్లలకు టికెట్ బుక్ చేశారో .. మీ డబ్బులు పోయినట్టే!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ HIT 3. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ (2025 మే 1న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు ఏప్రిల్ 25న హిట్ 3 సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు Xలో సెన్సార్ వివరాలు వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. 

హిట్ 3 మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అయితే, పలు కండిషన్స్తో సర్టిఫికెట్ జారీ చేస్తూ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని మూవీ టీమ్‌కి సూచించింది. కాగా ఈ మూవీ రన్‌టైమ్‌ 2 గంటల 37 నిమిషాలు ఉండనుంది. ఈ తెలుగు-భాషా యాక్షన్ థ్రిల్లర్లో నాని అర్జున్ సర్కార్ పాత్రలో పోలీసుగా నటించనున్నాడు. 

సెన్సార్ మార్పులు:

హిట్ 3 మూవీకి సెన్సార్ బోర్డు పలు కీలక మార్పులను సూచించింది. ఇటీవలే HIT 3 సెన్సార్ స్క్రీనింగ్ హైదరాబాద్‌లో జరిగింది. ఫైనల్ కట్ చూసిన తర్వాత, అధికారులు ఈ మూవీకి స్పష్టమైన Aసర్టిఫికేట్ ఇస్తామని వెల్లడించారు.

నాని మరియు అతని బృందం అధికారులతో 'U/A' సర్టిఫికేట్ జారీ చేయాలనీ చర్చలు జరిపినట్లు టాక్.  కానీ, ఈ సినిమాలో హింస మరియు శాపనార్థాలకు సంబంధించిన అనేక సీన్స్ ఉండటం అది కుదరదని సెన్సార్ బృందం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అందువల్ల A సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటుగా కొన్ని సీన్స్ కట్ చేయాలనీ అధికారులు మేకర్స్ కు సూచించారు. 

ముఖ్యంగాఇందులో సబ్‌టైటిల్స్‌తో సహా ‘F’వర్డ్స్‌ను తక్కువగా వినియోగించాలని, ఓ పదాన్ని మ్యూట్‌ చేయాలని చెప్పింది. ‘‘పోలీస్‌ యూనిఫామ్‌ కాలిపోతున్న దృశ్యాల్ని మార్చాలని, కాళ్లు, చేతులు, వేళ్లను కట్‌ చేసే సీన్స్ లో ఫ్లాష్‌ తగ్గించాలని, రక్తం చిందే సీన్లలో రెడ్‌ కలర్‌ను డార్క్‌గా చేయాలని’’సెన్సార్ బోర్డు సూచించింది. 

 ‘A’ సర్టిఫికేట్:

ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.

‘A’ సర్టిఫికేట్ జారీ చేయడం వల్ల ఈ సినిమాను చిన్నపిల్లలు చూడకూడదు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను థియేటర్స్ యాజమాన్యం లోపలికి అనుమతించదు. ముందే ఈ విషయాన్ని గ్రహించి సినిమాకు వెళ్లేలా చూసుకోండి.

ఒక్కసారి ఫ్యామిలీతో  వెళ్లాలని డిసైడ్ అయ్యి.. పిల్లలకు వయస్సు తక్కువ ఉన్న, పేరెంట్స్ గా మేము పక్కనే ఉంటాం, టికెట్స్ బుక్ చేసుకుంటాం.. అనుకుంటే మాత్రం మీ డబ్బులు పోయినట్టే. అందువల్ల నానిని ఇష్టపడే చిన్నపిల్లలకు థియేటర్లలో హిట్ 3 చూసే అవకాశం లేనట్టే!