సమయమా పాటకు నాని, మృణాల్ క్యూట్ స్టెప్స్.. వీడియో వైరల్

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna). పాన్ ఇండియా లెవల్లో వస్తున్నా ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తుండగా..  శౌర్యువ్(Shouryuv) దర్శకత్వం హవిస్తున్నారు. దసరా(Dasara) వంటి బ్లాక్ బస్టర్ తరువాత నాని నుండి వస్తున్న సినిమా కావడంతో.. హాయ్ నాన్న పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇటీవల హాయ్ నాన్న నుండి రిలీజైన సమయమా అనే సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. హేషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం ఆడించిన ఈ సోల్ ఫుల్ అండ్ క్యూట్ మెలోడియస్ సాంగ్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. చాలా మంది ఫేవరేట్ లిస్టులోకి చేరిపోయింది ఈ పాట. ఇక తాజాగా ఈ పాటకు హాయ్ నాన్న హీరోహీరోయిన్స్ నాని, మృణాల్ అదిరిపోయే స్టెప్స్ వేస్తూ రీల్ చేశారు. ఈ వీడియోలో మృణాల్ తన క్యూట్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఆడియన్స్ వీడియో చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ హాయ్ నాన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సీవీ మోహన్, విజేందర్ రెడ్డి, మూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.