Saripodhaa Sanivaaram OTT: అఫీషియల్..నాని రూ.100 కోట్ల వసూళ్ల తాండవం ఓటీటీలోకి వ‌స్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్

Saripodhaa Sanivaaram OTT: అఫీషియల్..నాని రూ.100 కోట్ల వసూళ్ల తాండవం ఓటీటీలోకి వ‌స్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక మొహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటించింది.

ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం (ఆగస్ట్ 29న) థియేటర్లలలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్ల తాండవం చూపించింది.

ఇప్ప‌టికీ పలుచోట్ల థియేట‌ర్ల‌లో ఆడుతోంది. సెప్టెంబ‌ర్ 20న(శుక్ర‌వారం) 30 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. థియేట‌ర్ల‌లో ఆడుతోండ‌గానే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read:-OTTలోకి ఒక్కరోజే 10కి పైగా సినిమాలు

ఈ మేరకు తాజాగా సరిపోదా శనివారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ గురువారం సెప్టెంబ‌ర్ 26 నుంచి ప్రముఖ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. 

అయితే.. ఈ చిత్రం నాలుగోవ వారాంతంలో కూడా ఇంకా కొన్ని థియేటర్లలో తన హవాను కొనసాగిస్తోంది. దీంతో ‘దసరా సినిమా తర్వాత’ 100 కోట్ల మైలురాయిని చేరుకున్న నాని రెండో చిత్రంగా ‘సరిపోదా శనివారం’ నిలిచింది. ఇకపోతే దసరా, హాయ్‌ నాన్న చిత్రాలు మంచి వసూళ్లతో పాటు ఇటీవలే పలు విభాగాల్లో సైమా-2024 అవార్డులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం.

కథేంటంటే:

సోకులాపురం గ్రామానికి చెందిన సూర్య (నాని)కి చిన్నతనం నుంచే కోపం ఎక్కువ. సూర్య చిన్నప్పుడే తల్లి (అభిరామి)ని క్యాన్సర్ కారణంగా కోల్పోతాడు. అయితే తల్లి చనిపోయే ముందే సూర్యకి తనలో ఉన్న ఆవేశాన్ని తగ్గించేందుకు వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించాలని మాట తీసుకుంటుంది. ఆ ప్రకారం అతను వారంలో మిగతా రోజులు ఎవరి మీద కోపం వచ్చినా దాచుకుని.. ఒక్క శనివారం మాత్రం ఆ కోపాన్ని తీర్చుకోవడం అలవాటు చేసుకుంటాడు.

ఈ క్రమంలో తప్పులు చేసిన చాలామందికి శనివారాల్లో బుద్ధి చెబుతుంటాడు. ఇలాంటి సమయంలోనే సూర్యకు ఒక గొడవలో చారులత(ప్రియాంక మోహన్) పరిచయమవుతుంది. మొదటి చూపులోనే ఆమె మీద ఇష్టం ఏర్పడుతుంది. ఐతే ఆమెకు వయలెన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఆమె సూర్యతో ప్రేమలో పడిన తర్వాత తన శనివారం సీక్రెట్ గురించి ఆమెకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఒక షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. కానీ ఓ కారణంగా ఊరి వదిలి వెళ్లినా ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక సోకులాపురంలోనే దయానంద్ (ఎస్‌జే సూర్య),పొలిటికల్ లీడర్ కుర్మానంద్ (మురళీశర్మ) ఇద్దరు అన్నదమ్ములు తమ ఆస్తి కోసం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకొంటుంటారు.

అయితే దయానంద్, కూర్మానంద్ మధ్య నాని దూరాల్సి వస్తుంది. పరమ రాక్షసుడిగా పేరున్న దయను ఢీకొట్టడంతో సూర్య తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. మరి ఆ ఇబ్బందులేంటి..వాటిని అధిగమించి దయ మీద సూర్య పైచేయి సాధించగలిగాడా? కూర్మానంద్ తన తమ్ముడికి ఆస్తిని ఇస్తాడా? అసలు దయానంద్ గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటర్ అయ్యాడు? సోకులపాలెం ప్రజల్ని సూర్య ఎలా కాపాడాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే. 

  • Beta
Beta feature