
నేచురల్ స్టార్ నాని (Nani) డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వచ్చిన దసరా మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో నాని ఓదెల 2 అనే వర్కింగ్ టైటిల్ తో.. నాని, శ్రీకాంత్ ఓదెల మరో మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ నాని కెరియర్ లో 33వ సినిమాగా రాబోతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ (SLV Cinemas) లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కనుంది.
ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీకి `నాయుడుగారి తాలూకా` (Nayudugari Taluka)అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. కాస్తా ఈ టైటిల్ నానికి ఓ వైపు క్లాస్ని.. మరో వైపు మాస్ని సూచించేలా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ అనౌన్స్ పోస్టర్ ని గమనిస్తే.."స్టైలిష్ లుక్, కోరా మీసాలతో నాని కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుండంగా..ఊర మాస్ లెవల్లో బీడీ తాగుతున్న స్టిల్" ఆకట్టుకుంటోంది. 'నాయకుడిగా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు'..అనే ట్యాగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అలాగే పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ మూవీకి బాలీవుడ్ బ్యూటీ శద్ధాకపూర్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్. ఆమె అయితేనే ఈ మూవీకి సరిపోతుందని అనుకుంటున్నారట.
ALSO READ | Jagapathi Babu: ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు.. జగపతి బాబు సంచలన ట్వీట్
అయితే శ్రద్ధాకపూర్ ను ఫైనల్ చేస్తారా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. సాహోలో ప్రభాస్ సరసన నటించిన శ్రద్ధా ఆ మూవీతో తెలుగు ఫ్యాన్స్ నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం స్త్రీ2 మూవీ సక్సెస్ లో జోష్ మీద ఉన్న శ్రద్ధాకపూర్ నానికి జోడీగా వస్తుందో లేదో చూడాలి. కాగా నాని ఓదెల 2 మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు.
Dasara turns one year today. On this occasion ..#Nani33
— Nani (@NameisNani) March 30, 2024
A Srikanth Odela MADNESS again. pic.twitter.com/RuNp8ljNVo
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..80 దశకంలో తెలంగాణలోని వ్యవస్థ, ఆ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఓ యువకుడు లీడర్ గా ఎలా ఎదిగాడు అనే కథతో ఈ సినిమా రానుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
On the auspicious occasion of Vijaya Dashami, the BLOCKBUSTER team, #NaniOdela2 embark on a journey to tell a story that will be etched in gold in World Cinema ✨#NaniOdela2 begins with a pooja ceremony ❤️🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) October 12, 2024
Shoot commences soon. Stay tuned for more exciting updates 💥
Natural… pic.twitter.com/uWgBomFfgR