The Paradise: ఫ్యాన్స్కు మాస్ ట్రీట్.. నాని, శ్రీకాంత్ ప్యారడైజ్ గ్లింప్స్‌‌‌‌ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

The Paradise: ఫ్యాన్స్కు మాస్ ట్రీట్.. నాని, శ్రీకాంత్ ప్యారడైజ్ గ్లింప్స్‌‌‌‌ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘దసరా’ తర్వాత రూపొందనున్న  చిత్రం ‘ప్యారడైజ్’ (The Paradise). సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జెర్సీ, గ్యాంగ్‌‌‌‌లీడర్ హిట్స్ తర్వాత నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రం ఇది.

ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లేటెస్ట్గా ప్యారడైజ్ గ్లింప్స్‌‌‌‌ను రెడీ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఈ స్పెషల్ గ్లింప్స్‌‌‌‌ను ఫిబ్రవరి 20న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని ఇప్పటికే ప్రకటించగా, దానికి తగ్గట్టుగానే ఈ స్పెషల్ వీడియో కోసం అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడట. ఇది నాని ఫ్యాన్స్‌‌‌‌కు ట్రీట్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు.  ప్రస్తుతం నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్‌‌‌‌గా జిమ్‌‌‌‌ చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. 

Also Read :- ఫస్ట్ టైమ్ మంచు విష్ణు సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్

ఈ క్రమంలో హీరో నాని తల్లిపాత్ర కోసం బాహుబలి మూవీ ఫేమ్ రాజమాత రమ్య కృష్ణ పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే నటి రమ్యకృష్ణ కి ది ప్యారడైస్ సినిమా స్టోరీ వినిపించగా రమ్యకృష్ణకి కథ బాగా నచ్చడంతో హీరో తల్లి పాత్రకి వెంటనే ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రముఖ సీనియర్ హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు నటిస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రెజెంట్ నాని ‘హిట్3’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అలాగే నాని నిర్మాతగా ‘కోర్టు’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రియదర్శి లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తున్నాడు. మార్చి 14న ఈ సినిమా విడుదల కానుంది.