పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ అర్జున్ సర్కార్గా నాని.. కౌంట్ డౌన్ షురూ..!

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ అర్జున్ సర్కార్గా నాని.. కౌంట్ డౌన్ షురూ..!

నాని, శ్రీనిథి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్’. ఈ ఫ్రాంచైజీలో శైలేష్ కొలను రూపొందిస్తున్న మూడో చిత్రమిది.  మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్  సినిమాపై అంచనాలు పెంచాయి. 

 ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌‌‌ జరుగుతోంది.   ఈ సందర్భంగా 30 డేస్ కౌంట్ డౌన్ అంటూ సరికొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాని ఇంటెన్స్ లుక్ లో సిగరెట్ కాలుస్తూ గన్ గురి పెట్టి  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు.  ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నాని కనిపించనున్నాడు.  

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.