రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ఆకట్టుకున్న నాని..తన నెక్స్ట్ ప్రాజెక్టు ‘హిట్ 3’పై ఫోకస్ పెట్టాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో ‘హిట్’ ఫ్రాంచైజీని నిర్మించిన నాని.. ఇప్పుడు తనే హీరోగా మూడో భాగాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్‌ను పరిచయం చేసిన గ్లింప్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యాడు.
ఇందులో అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన కంప్లీట్‌గా మేకోవర్ అయ్యాడు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా, నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తుండగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా మే 1న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.