ప్యారడైజ్ టైటిల్ లీక్‌‌పై నాని క్లారిటీ..

ప్యారడైజ్ టైటిల్ లీక్‌‌పై నాని క్లారిటీ..

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రీసెంట్‌‌గా మరో  మూవీని  ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన  ‘దసరా’ తర్వాతి చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ఈ మూవీ టైటిల్ ‘ది ప్యారడైజ్’ అంటూ లీక్ అవడంతో నాని అఫీషియల్‌‌గా సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేశాడు. కానీ ఈ టైటిల్ లీక్‌‌పై  వస్తోన్న రూమర్స్‌‌పై దర్శకుడు శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తనకు తెలుసని అన్నాడు.  తన టీమ్‌‌తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. 

‘‘నా సినిమాకే కాదు.. ఏ సినిమాకేౖనా లీకుల బెడద ఉంటే.. అసిస్టెంట్‌‌ డైరెక్టర్స్‌‌, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిది. సినీ రంగానికి సంబంధించి రాబోయే తరం క్రియేటర్స్‌‌ వాళ్లు. సినిమా రంగానికి వారు అందించే నిస్వార్థమైన సేవలను గౌరవించాలి. కష్టపడి పనిచేసే డిపార్ట్‌‌మెంట్లపై నిందలని వేసే అలవాట్లను మార్చుకోండి. నా సినిమా టైటిల్‌‌ను లీక్‌‌ చేసిన వ్యక్తులెవరో నాకు తెలుసు. వాళ్లు నా టీమ్‌‌లో వారైతే కాదు’’ అని ట్విటర్‌‌‌‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నాని ‘హిట్3’ షూటింగ్‌‌లో బిజీగా ఉండగా, వచ్చే నెలలో  ‘ప్యారడైజ్’ రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.