Court Box Office: నాని మూవీకి లాభాల వర్షం.. ఐదు రోజుల కలెక్షన్లు ఇవే..

Court Box Office: నాని మూవీకి లాభాల వర్షం.. ఐదు రోజుల కలెక్షన్లు ఇవే..

చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ (Court) మూవీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.33.55 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సందర్భంగా (మార్చి 19న) మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

ఐదో రోజైన మంగళవారం (మార్చి 18న) రూ.2.4 కోట్లు వసూళ్లు సాధించింది. ఇండియాలో ఈ మూవీ 5 రోజుల్లో రూ.20 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో కలిపి ఈ మూవీకి రూ.19.8 కోట్లు వచ్చినట్టు సమాచారం.

సాక్నిల్క్ నివేదిక ప్రకారం:

'కోర్ట్: స్టేట్ vs ఎ నోబడీ' ఇండియా బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లో రూ.20 కోట్ల నెట్ వసూలు చేసింది. ఫస్ట్ డే రూ.4.15 కోట్లు, రెండవ రోజు రూ.5 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు ఏకంగా రూ. 5.65 కోట్లు, నాలుగోవ రోజు రూ.2.60 కోట్లు, ఐదో రోజు రూ.2.4 వసూలు చేసింది.

కోర్ట్ మూవీ దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్ అయిందని సినీ వర్గాల సమాచారం. అందులో నాన్ థియేట్రికల్ హక్కుల మొత్తంగా రూ.9.5కోట్లు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో ఓటీటీ రైట్స్ ద్వారా రూ.8 కోట్లు వచ్చాయని, ఆడియో ద్వారా 30 లక్షలు వచ్చాయని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు.

ALSO READ | పాట్నా హైకోర్టుకెళ్లిన గోదావరి సినిమా హీరోయిన్... ఏం జరిగిందంటే..?

ఇకపోతే, కోర్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‍ఫ్లిక్స్ మంచి ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ మూవీ రిలీజ్ కి ముందే అలోమోస్ట్ పెట్టిన మొత్తాన్ని రాబట్టేలా బిజినెస్ చేసింది. దీంతో ప్రస్తుతం నాని మూవీకి లాభాల వర్షం కురుస్తోంది. ఇపుడు సెకండ్ వీక్ షురూ చేసిన కోర్ట్ తన తుది తీర్పుతో ఎంతటి వసూళ్ల ప్రభంజనం సృష్టించనుందో ఆసక్తి రేపుతోంది.

డైరెక్టర్ రామ్ జగదీశ్ పోక్సో చ‌ట్టంలోని లోతుపాతుల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు . తొలి చిత్రంతోనే తన సత్తాను సామాజిక కోణంలో చూపించి సక్సెస్ అయ్యాడు. అందుకు తోడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను రాసుకుని బోర్ కొట్టకుండా కథలో లీనం చేసాడు. ప‌గ ప్ర‌తీకారాల కోసం పోక్సో లాంటి చ‌ట్టాల‌ను కొంద‌రు తమ డబ్బు, అధికార మదంతో ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? అనే పాయింట్ అందరినీ మెప్పిస్తుంది.