HITTheThirdCase: నాని క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 గ్లింప్స్ రిలీజ్..అర్జున్ సర్కార్ వేట అప్పుడే

హిట్ సిరీస్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు శైలేష్ కొలను. ఆయన నుండి వచ్చిన రెండు హిట్, హిట్2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు ఆడియన్స్ కు థ్రిల్ పంచాయి.

మొత్తం ఏడు పార్టులుగా వస్తున్న ఈ సిరీస్ కు హీరో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. సిరీస్ లో నెక్స్ట్ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా చేయగా.. రానున్న మూడో పార్ట్ లో నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా హిట్ 3 నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది (2025) మే 1న హిట్ 3 రిలీజ్ కానున్నట్లు ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ మాస్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోకి "నేరస్థులని పట్టుకోవడానికి..అర్జున్ సర్కార్ బాధ్యతలు స్వీకరించాడు. మే 1, 2025న బ్లడ్ గేట్‌లు తెరవబడతాయి..హిట్ 3 హంటర్స్ కమాండ్" అంటూ ట్యాగ్ ఇచ్చారు మేకర్స్. నాని లుకింగ్ స్టైల్ కి, ఆ స్వాగ్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా గ్లింప్స్ ఉంది. దీంతో నాని ఖాతాలో మరో హిట్ కన్ఫమ్. 

ప్రస్తుతం అర్జున్ సర్కార్ కోసం ఒక పవర్ఫుల్ విలన్ ను సెట్ చేశారట. అందుకోసం చాలా అప్షన్స్ వినిపిస్తున్నాయి. అందులో హీరో రానా, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఉన్నారట. నిజంగా వీరిలో ఎవరు ఒప్పుకున్నా సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్లడం ఖాయం. అందుకే ఈసారి హిట్ సినిమాను పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లనున్నారట మేకర్స్. మరి వీరిలో ఎవరిని ఒకే చేస్తారో చూడాలి.

Also Read :- మిస్టర్ బచ్చన్ మూవీకి భారీ నష్టాలు

ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, అలాగే యూనానిమస్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.