సినిమా రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రదానం చేసే ఐఫా 2024 అవార్డుల వేడుకలు అబుదాబిలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల్లో ప్రముఖ తెలుగు హీరోలైన రానా దగ్గుబాటి, తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాని, తదితరులతోపాటూ మరింతమంది సినీ నటులు హంగామా చేశారు.
కాగా గత ఏడాది తెలుగు ప్రముఖ హీరో నాని మరియు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కిన దసరా చిత్రానికి ఉత్తమ చిత్రం కేటగిరీలో ఐఫా 2024 అవార్డు లభించింది. దీంతో హీరో నాని ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరియు నటి సుహాసిని చేతుల మీదుగా ఐఫా అవార్డు అందుకున్నాడు. సింగరేణి బొగ్గు గనులు మరియు లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేగాకుండా దాదాపుగా రూ.117 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది.
ALSO READ | IIFA Utsavam 2024: అంగరంగ వైభవంగా ఐఫా అవార్డుల వేడుక.. విజేతలు వీరే..
ఈ విషయం ఇలా ఉండగా దసరా చిత్రానికి సైమా అవార్డులు కూడా లభించాయి. ఈ క్రమంలో ఈ చిత్రంలో హీరోగా నటించిన నానితో పాటూ హీరోయిన్ కీర్తీ సురేష్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరియు దీక్షిత్ శెట్టి తదితరులకు సైమా అవార్డులు దక్కాయి.