నాని (Nani) హీరోగా..శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ హాయ్ నాన్న(Hi Nanna). నాని 30వ సినిమాగా రిలీజ్కు సిద్దమయ్యింది. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి 'అమ్మాడి' థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సాంగ్ నాకు ఎంతో స్పెషల్.. నా హస్బెండ్కి ఈ పాట అంకితమిస్తున్న..ఇది మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ..అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సాంగ్ స్టార్ట్ అవ్వగా..'ప్రాణం అల్లాడి పొద అమ్మాడి..అందం కట్టేసుకుంటే అమ్మాడి..ఇంకా కలలోనే ఉన్న అమ్మాడి..కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే..అంటూ శ్రావ్యమైన సంగీతంతో ఈ పాట సాగింది.
ఈ సాంగ్కు కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ చాలా చక్కగా కుదిరాయి. కాల భైరవ, శక్తి శ్రీ గోపాలన్ ఆలపించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) అందించిన సంగీతం మెస్మరైజింగ్ ఉంది. ఈ పాటలో నాని, మృణాల్‌ల మ్యారేజ్ అయ్యినట్లు చూపించారు. నాని.. మృణాల్ మధ్య వచ్చే అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది.
హాయ్ నాన్న మూవీ మొదటి నుంచి తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తో వస్తుందనే అనుకున్న వారికి..ఇందులో మరో అందమైన ప్రేమ జంట మధ్య సాగే సన్నివేశాలు.. కూడా హైలైట్ కాబోతున్నాయని..ఈ పాటతో కన్ఫర్మ్ అయిపొయింది.
ఇప్పటికే హాయ్ నాన్న నుంచి రిలీజైన సమయమా..గాజుబొమ్మ సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.ఇక ఈ సాంగ్తో మరో వినసొంపైన గీతాన్ని అందించిన మేకర్స్..త్వరలో ప్రీ రిలీజ్కు సిద్ధమయ్యారు.
హాయ్ నాన్న మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. ఖుషీ చిత్రానికి మ్యూజిక్ అందించిన హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతుంది