హిట్‌‌ : ది థర్డ్ కేస్‌‌ నుంచి కొత్త పోస్టర్‌‌‌‌ విడుదల

హిట్‌‌ : ది థర్డ్ కేస్‌‌ నుంచి కొత్త పోస్టర్‌‌‌‌ విడుదల

నాని హీరోగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్‌‌ : ది థర్డ్ కేస్‌‌’. శ్రీనిధి శెట్టి హీరోయిన్.  డాక్టర్ శైలేష్ కొలను దీనికి దర్శకుడు.  క్రిస్మస్ సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.  బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌‌లో సన్‌‌ గ్లాసెస్‌‌తో  స్టైలిష్‌‌గా కనిపిస్తున్నాడు నాని.  వెనుక మంచు పర్వతాలు, పక్కనే  నల్లని గుర్రం పోస్టర్‌‌‌‌ను మరింత హైలైట్‌‌ చేశాయి.  

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్‌‌‌‌లో జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌‌లు చిత్రీకరిస్తున్నారు.  యునానిమస్ ప్రొడక్షన్స్‌‌తో కలిసి నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది మే 1న సినిమా విడుదల కానుంది.