Nani : భయమలా బిగిసెలే .. హిట్: ది థర్డ్ కేస్‌‌‌‌ మూవీ సెకండ్ సింగల్ రిలీజ్

Nani : భయమలా బిగిసెలే .. హిట్: ది థర్డ్ కేస్‌‌‌‌ మూవీ సెకండ్ సింగల్ రిలీజ్

నాని హీరోగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్‌‌‌‌’. శైలేష్ కొలను దర్శకుడు. బుధవారం ఈ చిత్రం నుంచి ‘అబ్కీ బార్‌‌‌‌‌‌‌‌..’ అనే రెండో పాటను విడుదల చేశారు. నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర వ్యక్తిత్వాన్ని ఈ పాటలో ప్రజెంట్ చేశారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. ‘‘అలజడే ఎగసెలే  భయమలా బిగిసెలే.. అణకువే ఆపలేనిది వేగమే.. సహనమే ఎరగని గుణమే.. సమరమే నిలువదే చూడే.. నడుమనే మృత్యువొచ్చినా వ్యర్థమే..” అంటూ కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. 

ఏప్రిల్ 14న ట్రైలర్‌‌‌‌ను విడుదల చేయబోతున్నారు. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌‌‌‌‌,  యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మే 1న సినిమా విడుదల కానుంది.