Hi Nanna: గుండెల్ని పిండేస్తోన్న ఫీల్‌గుడ్‌ మెలోడీ.. హార్ట్ బీట్ ఆఫ్ హాయ్ నాన్న

Hi Nanna: గుండెల్ని పిండేస్తోన్న ఫీల్‌గుడ్‌ మెలోడీ.. హార్ట్ బీట్ ఆఫ్ హాయ్ నాన్న

నాని (Nani) హీరోగా..శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ హాయ్ నాన్న(Hi Nanna).  నాని 30వ సినిమాగా వస్తోన్న ఈ మూవీ రేపు (డిసెంబర్ 7న) రిలీజ్ కాబోతుంది.ఫీల్‌గుడ్‌ లవ్ స్టోరీ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మేళవింపుతో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఐదవ పాట రిలీజ్ అయింది. హార్ట్ బీట్ అఫ్ హాయ్ నాన్న గా రిలీజైన ఇదే ఇదే తొలిసారిగా సాంగ్ ఆకట్టుకుంటోంది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను హేషమ్‌ అబ్దుల్‌ స్వరపరచి ఆలపించిన తీరు గుండెల్లో వెచ్చని హాయినిస్తోంది. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయని నాని ఇదివరకే చెప్పాడు. కానీ, ఇప్పటికి బయటకి వచ్చింది అయిదు పాటలే కాబట్టి..ఇంకో సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. మరి ఆరో సాంగ్ ఈరోజు ఈవెనింగ్ లోపు రిలీజ్ చేస్తారా లేక సినిమా రిలీజ్ అయ్యాక  డైరెక్ట్ గా థియేటర్స్ లో  చూడాల్సిందేనా అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ ఆడియన్స్ ను థియేటర్స్ వైపు నడిచేలా చేస్తోన్నాయి. ఇప్పటికే జోరు మీదున్న సినిమా ప్రమోషన్స్  విభిన్నమైన శైలిలో అన్ని రకాల ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తూ వస్తున్నారు నాని. 

ఈ సినిమాని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు.