నేచురల్ స్టార్ నాని (Nani)తో దసరా (Dasara) లాంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు. ఇక అదే ఊపులో దసరా సినిమా తర్వాత మళ్లీ నానితోనే శ్రీకాంత్ రెడీ అయ్యాడు.
రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో స్టైలిష్ లుక్, కోరా మీసాలతో నాని కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుండంగా..ఊర మాస్ లెవల్లో బీడీ తాగుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. నాయకుడిగా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు..అనే ట్యాగ్ తో సినిమా ఏ విధంగా ఉండనుందో అనే అంచనాలు షురూ చేశారు శ్రీకాంత్.
తాజా విషయానికి వస్తే..నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి ఈసారి దసరాని మించిన కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చేయాలని చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం నాని 6 నెలల బల్క్ డేట్స్ అడిగాడట శ్రీకాంత్ ఓదెల. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ లుక్ అంఫిక్స్ అయ్యారట. అందుకు నాని కూడా ఈ సినిమా కోసం ముందే వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా కోసం నాని నుంచి 6 నెలల బల్క్ డేట్స్ కూడా అడిగాడట. ఇందుకు నాని కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
అలాగే, ఈ సినిమాలో నటించే వాళ్లకి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. అందుకు ఉదాహరణగా కాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ అని చెప్పొచ్చు. "కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది..భీకర విప్లవం రూపుదిద్దుకుంటుంది.రండి, విప్లవంలో చేరండి..నానీ 33తో మీ గుర్తింపును కనుగొనండి" అంటూ ప్రకటించారు. అంతే కాదు తమ సినిమాలో నటించాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవారు..ఏడాది పాటు టైం కేటాయించే కమిట్మెంట్ ఉండాలని, ప్రతి నటుడు మరియు నటి ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ కి సిద్ధంగా ఉండాలని వర్క్ షాప్స్ కి కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుందని గతంలో తెలిపారు.
ఈ మూవీ నాని కెరియర్ లో 33వ సినిమాగా రాబోతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..80 దశకంలో తెలంగాణలోని వ్యవస్థ, ఆ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఓ యువకుడు లీడర్ గా ఎలా ఎదిగాడు అనే కథతో ఈ సినిమా రానుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.