గోవాలో నాని కొత్త మూవీ షెడ్యూల్‌‌‌‌

‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం తన నెక్స్ట్‌‌‌‌ మూవీపై ఫోకస్ పెట్టాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో తండ్రీకూతురు మధ్య బాండింగ్‌‌‌‌ను చూపించనున్నారు.  ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసిన టీమ్.. ఇటీవల రెండో షెడ్యూల్‌‌‌‌ను మొదలుపెట్టారు.

ఇది లెంగ్తీ షెడ్యూల్‌‌‌‌ అని.. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోందని ప్రకటించారు మేకర్స్. నలభై రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుందట. దీంతో  టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందని తెలుస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. నాని  కూతురిగా బేబి కైరా కనిపించనుంది.

మోహన్‌‌‌‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌‌‌‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  హెశమ్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ వహబ్‌‌‌‌ సంగీతం అందిస్తున్నాడు.  క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 21న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే  అనౌన్స్ చేశారు.  ‘నాన్న’ పేరుతో టైటిల్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.