Saripodhaa Sanivaaram: నెట్‌ఫ్లిక్స్‌లో సరిపోదా శనివారం దూకుడు .. ఇండియాలోనే నంబర్ 1

Saripodhaa Sanivaaram: నెట్‌ఫ్లిక్స్‌లో సరిపోదా శనివారం దూకుడు .. ఇండియాలోనే నంబర్ 1

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక మోహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటించింది.

ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం (ఆగస్ట్ 29న) థియేటర్లలలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్ల తాండవం చూపించింది.

ALSO READ | చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్స్ కి రూ. 5లక్షలు విరాళం అందించిన సాయి గుర్గ తేజ్.

ఇక ఇప్పుడు సెప్టెంబర్ 26 అర్థరాత్రి నుంచి  నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో మిలియన్ వ్యూస్కు పైగా సాధించింది. అలాగే ఆల్ ఇండియా లెవల్లో నంబర్ 1 గా నిలిచింది. దీంతో  సరిపోదా శనివారం మూవీ నెట్ఫ్లిక్స్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది అంటూ లవ్ సింబల్తో హీరో నాని  ఓ పోస్టర్ షేర్ చేశారు. 

సరిపోదా శనివారం సినిమా నుంచి వచ్చిన ఓఎస్‍టీలో 73 బీజీఎం సౌండ్ ట్రాక్స్ ఉన్నాయి. సోనీ మ్యూజిక్ సౌత్ యూట్యూబ్ ఛానెల్‍లో ఓఎస్‍టీని మూవీ టీమ్ అందుబాటులోకి తెచ్చింది. “రీసౌండింగ్ ఇంపాక్ట్‌తో థియేట్రలను షేక్ చేసిన బీట్స్.. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేశాయి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్.

ఇప్పటికే ఈ మూవీలోని కొన్ని బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్స్ చాలా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో మోత మోగిపోయాయి. ఇప్పుడు ఓఎస్‍టీ రావటంతో మూవీలోని అన్నీ బీజీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ సినిమా యాక్షన్ సీన్లను ఎలివేట్ చేయటంలో జేక్స్ బేజోయ్ మ్యూజిక్ చాలా ఉపయోగపడింది.

  • Beta
Beta feature