HIT3Trailer: హిట్ 3 ట్రైలర్ రిలీజ్‍.. నాని వైలెన్స్ నెక్స్ట్ లెవెల్‍.. టీజర్కు మించిన రక్తపాతం

HIT3Trailer: హిట్ 3 ట్రైలర్ రిలీజ్‍.. నాని వైలెన్స్ నెక్స్ట్ లెవెల్‍.. టీజర్కు మించిన రక్తపాతం

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ HIT 3. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ (2025 మే 1న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఏప్రిల్ 14న హిట్ 3 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

హిట్ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ వైల్డ్ గా ఉంది. ఫుల్ వైలెన్స్‌తో నాని గత సినిమాలకు భిన్నంగా ఉంది. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని విశ్వరూపం చూపించేశాడు.

"సర్.. క్రిమినల్స్.. ఉంటే భూమ్మీద 10 ఫీట్స్ సెల్లో ఉండాలి. ఉంటే భూమి లోపల 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరిల్ కరెక్షన్ అవ్వని ఏ క్రిమినల్ కూడా బయట తిరగడానికి వీల్లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్ గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసోడు అయితే చాలు" అంటూ నాని డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది.

Also Read : మార్క్ శంకర్ పేరిట అన్నదానం

9 నెలల పసిపాపని కిడ్నాప్ చేసిన ఓ క్రిమినల్ ను పట్టుకోవడానికి నాని కశ్మీర్ బయలు దేరుతాడు. ఆ తర్వాత అక్కడ నాని ఫైట్ సీన్స్, నాని చూపించే కోపం, హీరోయిన్ తో ప్రేమ ఇవన్నీ ఆసక్తి రేపుతున్నాయి. 'జనాల్లో మధ్యలో ఉంటే అర్జున్, మృగాలా మధ్యలో ఉంటే సర్కార్' అంటూ నాని పాత్రను రివీల్ చేస్తూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

3.31 నిమిషాల 31 సెకెన్ల పాటు సాగిన ఈ ట్రైలర్లో నాని వైలెన్స్ నెక్స్ట్ లెవెల్‍లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఇంపాక్ట్ చూపించేసింది. ప్రస్తుత ట్రైలర్ అంతకు మించిన రక్తపాతంతో సాగుతుంది. ఇందులో హీరో నాని విపరీతమైన కోపంతో తాండవం చేస్తున్న సీన్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాతో నాని, శైలేష్ కొలను ఎలాంటి ఆరా క్రియేట్ చేయనున్నారో చూడాలి. ఈ ట్రైలర్ ఈవెంట్ వైజాగ్‍లోని సంగం థియేటర్లో జరుగుతుంది. 

ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్స్‌‌తో కలిసి నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు. హిట్ 1లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడివి శేషు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇకపోతే ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‍గా నటించారు. కోమలీ ప్రసాద్, సూర్యశ్రీనివాస్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. అయితే, ఇందులో తమిళ స్టార్ హీరో కార్తీ క్యామియో రోల్‍లో కనిపించనున్నారనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. త్వరలో క్లారిటీ రానుంది.