The Paradise Release: నాని ఆ సెంటిమెంట్ వదలడం లేదు.. అందుకేనా ఈ బ్లాక్ బాస్టర్ హిట్స్!

The Paradise Release: నాని ఆ సెంటిమెంట్ వదలడం లేదు.. అందుకేనా ఈ బ్లాక్ బాస్టర్ హిట్స్!

నేచురల్ స్టార్ నాని గురువారం సెంటిమెంట్ వదలడం లేదు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమాను కూడా గురువారమే రిలీజ్ చేస్తుండటం విశేషం. సెంటిమెంట్ బాగా కలిసొస్తుండటంతోనే నాని గురువారం ఎంచుకున్నారనే టాక్ వస్తోంది.

లేటెస్ట్గా (మార్చి 4న) 'ది ప్యారడైజ్' టీజర్ 8 భాషల్లో 23 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుని ట్రెండింగ్లో ఉందని ప్రకటించారు మేకర్స్. అలాగే ఈ మూవీ మార్చి 26న 8 భాషల్లో రానుందని కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే మార్చి 26, 'గురువారం' రోజు వస్తోంది. అయితే, నాని గురువారం సెంటిమెంట్ అసలు ఏ మాత్రం వదలడం లేదు.

గత సినిమాలు చూసుకుంటే నాని కెరీర్లో బిగెస్ట్ హిట్గా నిలిచిన 'దసరా' మూవీ 2023 మార్చి 30న గురువారం రోజు రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత 'హాయ్ నాన్న' మూవీ 2023 డిసెంబర్ 7న గురువారం రోజున, అలాగే 'సరిపోదా శనివారం' 2024 ఆగస్టు 29న గురువారం రిలీజ్ అయ్యాయి.

ALSO READ | OTT Movies: ఓటీటీలోకి ఈ వారం (మార్చి 3to9) 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. తెలుగులో 5 ఇంట్రెస్టింగ్‌

ఇక ఇప్పుడు 'హిట్ 3' మూవీని 2025 మే 1న గురువారం.. 'ది ప్యారడైజ్' చిత్రాన్ని 2026 మార్చి 26న గురువారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇలా తన చిత్రాలను గురువారం రోజున రిలీజ్ చేస్తూ.. బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు నాని. ఇప్పుడు తన రాబోయే సినిమాలను కూడా అదే సెంటిమెంట్ తో రిలీజ్ చేస్తూ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు.

ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. 8 భాషల్లో 23 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుని ట్రెండింగ్ లో ఉంది. చరిత్రలో చిలకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి మర్చిపోయారని డైలాగ్ తో టీజర్ ఆకట్టుకుంది.  ఇది కడుపు మండిన కాకుల కథ అంటూ శవాలపై కాకులు తిరుగుతున్న విజవల్స్ అంచనాలు పెంచేశాయి. దీన్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అనే ఊహ ప్రతి సినీ అభిమానిలో ఆలోచన పుట్టిస్తుంది.