
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమా వచ్చే ఏడాది ఇదే రోజు(మార్చ్ 26)న విడుదల కానుంది. ఇంకా 365 రోజులు అంటూ నాని ఓ పోస్టర్ ను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇందులో నాని గన్ పట్టుకుని కోపంగా చూస్తూ కనిపించా డు. ప్రజంట్ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాల ను పెంచేసింది.
రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్ లో నాని కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ కానుంది. కాగా నాని శ్రీకాంత్ కాంబోలో వచ్చిన 'దసరా' మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ALSO READ | ఇదేం లాజిక్.. అందమైన అమ్మాయిల తల్లిదండ్రులు తప్పు చెయ్యరా..?
ఈ విషయం ఇలా ఉండగా హీరో నాని ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా వ్యవహరిస్తూ బాగానే సక్సెస్ అవుతున్నాడు. ఇటీవలే నాని నిర్మించిన కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈక్రమంలో దాదాపుగా రూ.50 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. తక్కువ బడ్జెట్ తో మంచి ఇన్ఫర్మేటివ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమా నాని కి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాని కూడా హీరో నాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి దసరా మూవీ ప్యాసమే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.
365 Days/రోజులు.#TheParadise pic.twitter.com/jITmj1Cq9e
— Nani (@NameisNani) March 26, 2025