Dil Raju :ఎల్లమ్మ వచ్చేస్తోంది..బలగం వేణు, నాని కాంబో ఫిక్స్

Dil Raju :ఎల్లమ్మ వచ్చేస్తోంది..బలగం వేణు, నాని కాంబో ఫిక్స్

డైరెక్టర్ బలగం వేణు తన తరువాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నాని (Nani)ని సెలెక్ట్ చేసుకున్నాడట. ఈ కాంబోని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెట్ చేశారని చాలా కాలంగా వింటూ వస్తున్నాం. ఇక న్యాచురల్ కాంబో సెట్ అయిందని తాజాగా నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రకటించాడు.

ఇవాళ (మార్చి 7) లవ్ మి మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా దిల్ రాజు ఈ విషయాన్ని చెప్పాడు. ఓ అభిమాని మాట్లాడుతూ.."నాని, వేణు యెల్దండి మూవీ అప్డేట్ ఏంటి" అడగ్గా..దిల్ రాజు స్పందిస్తూ..స్టోరీ ఫైనల్ అయింది ఎల్లమ్మ వస్తది' అని చెప్పడం విశేషం. ఒక్కసారిగా దిల్ రాజు నుంచి ఆ మాట వినగానే..అక్కడున్న ఫ్యాన్స్ గట్టిగా అరిచారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథ చర్చలు పూర్తవగా..ఫైనల్ నేరేషన్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం.

ఈ సినిమాకు..తెలంగాణ మనుషులలో బాగా పాపులర్ అయిన ఎల్ల‌మ్మ (Ellamma) పేరుని టైటిల్గా ఎంచుకోవడంతోనే బలగం వేణు సక్సెస్ అయ్యారు. క‌థ‌ని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ వేణు ఆ టైటిల్ సెలెక్ట్ చేయడంతో నాని..దిల్ రాజు కూడా సానుకూలంగానే స్పందించడం గొప్ప విషయమని చెప్పుకోవొచ్చు. అంతేకాకుండా దిల్ రాజు, నాని ఈ సినిమాకు సంబంధించి వేణు విజ‌న్కి పెద్ద పీట వేస్తూ..త‌న‌కి పూర్తిగా స్వేచ్ఛ‌ని క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది.

ఎల్లమ్మ అనే పేరుతో..తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాలని వేణు ఫిక్స్ అయ్యాడట. తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్లమ్మ గ్రామ దేవతగా పిలుస్తుంటారు. అలాంటిది నాని సినిమాకి ఎల్లమ్మ టైటిల్‌గా పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టైటిల్కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అంతేకాకుండా ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరిలో జరిగే ఓ పీరియాడికల్ లవ్ స్టోరీని తనదైన శైలిలో వేణు కథని సిద్ధం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

ఇదివరకే నాని శ్యామ్ సింగరాయ్తో పీరియాడిక్ కాన్సెప్ట్ టచ్ చేశాడు. ఇక బలగం వేణు..నానితో కొత్తగా తెలంగాణ లవ్ స్టోరీతో తనదైన పాత కాలానికి..ప్రేమలు హత్తుకునే సామ్రాజ్యానికి తీసుకెళ్తున్నాడట. ప్రస్తుతం ఈ కాంబోపై ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని విషయాలతో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  

ALSO READ :- ఇవే నాకు చివరి ఎన్నికలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను: కోడాలి నాని

ఇటీవలే నాని హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం మూవీలో నటిస్తున్నాడు.