చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరా: నారా భువనేశ్వరి

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ పై ఆయన సతీమణి భువనేశ్వరి స్పందించారు.  విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.  ఇటువంటి సమయంలోనే తన భర్తను రక్షించాలని.. ఆయనకు ధైర్యం ఇవ్వాలని .. ఆ అమ్మవారిని కోరినట్లు  చెప్పారు.   రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని ..ప్రజల కోసం చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయాణం దిగ్విజయం కావాలన్నారు.  ప్రతి ఒక్కరు చేయిచేయి కలిపి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటో గుర్తించాలని సూచించారు. 

ALSO READ :చంద్రబాబు మాత్రమే కాదు.. దేశంలో అరెస్ట్ అయిన సీఎంలు, మాజీ సీఎంలు వీళ్లే

స్కిల్ డెవ్ లప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు నంద్యాలలో  అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..   కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారంటూ చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు అర్థరాత్రి నుంచి ప్రయత్నించగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన అనంతరం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.  చంద్రబాబును  విజయవాడలోని సిట్ ఆఫీసుకు తరలించనున్నారు.  అక్కడే  చంద్రబాబుకు వైద్యపరీక్షలు చేసిన తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.