535 కోట్లకు పెరిగిన నారా భువనేశ్వరి సంపద

535 కోట్లకు పెరిగిన నారా భువనేశ్వరి సంపద
  • ఎన్నికల్లో గెలుపుతో 55% పెరిగిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్ విలువ
  • నారా లోకేశ్ షేర్ల విలువ 237 కోట్లకు

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌‌‌‌‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టీడీపీ పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడంతో నారా చంద్రబాబు నాయుడు కుటుంబ కంపెనీల స్టాక్స్​ భారీగా లాభాలను ఆర్జించాయి. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ రూ.424 వద్ద ట్రేడయింది. అయితే శుక్రవారం ఈ షేర్ విలలువ రూ.661.25కు చేరుకుంది.

దీంతో కంపెనీ ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ నారా భువనేశ్వరి షేర్ల వాల్యూ ఏకంగా రూ.579 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీలో నారా లోకేశ్ కు కూడా పెద్ద సంఖ్యలో షేర్లు ఉన్నాయి. వాటి విలువ రూ.237.8 కోట్లకు పెరిగింది. బీఎస్​ఈ డేటా ప్రకారం నారా భువనేశ్వరి కంపెనీ టాప్ షేర్ హోల్డర్, ఆమె 2 కోట్ల 26 లక్షల 11 వేల 525 స్టాక్‌‌‌‌‌‌‌‌లను కలిగి ఉన్నారు. నారా లోకేశ్ కు 1కోటి 37 వేల 453 షేర్లు ఉన్నాయి. 1992లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్‌‌‌‌‌‌‌‌ను స్థాపించారు.