2024 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నుండే ఘన విజయం సాధించటం పట్ల టీడీపీ శ్రేణులు కాలర్ ఎగరేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి తన ఎక్స్ ( ట్విట్టర్ ) ద్వారా చేసిన ఆసక్తికర ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన బ్రాహ్మణి, "అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడీ వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశారని, పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించారని కొనియాడారు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్లకు నువ్వేంటో తెలియజేశావని లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఇడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ళకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో… pic.twitter.com/43S0FzXeDi
— Brahmani Nara (@brahmaninara) June 24, 2024
సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు, నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుందని, కంగ్రాట్స్ డియర్ అంటూ బ్రాహ్మణి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.